వంశీ ఎందుకు పార్టీ మారాడో చెప్పిన చిన‌రాజ‌ప్ప‌…

-

తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు, లోకేష్ ను ఎంత తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వంశీ అసెంబ్లీ సమావేశాల్లో తనను స్వతంత్ర ఎమ్మెల్యే గుర్తించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కు విజ్ఞప్తి చేసుకున్నారు. స్పీక‌ర్‌ సైతం వంశీ విజ్ఞప్తిని మన్నించి నిబంధనల మేరకు నడుచుకుంటానని… అసెంబ్లీలో మీకు నచ్చిన సీట్లో కూర్చోవాలని చెప్పారు. ఇక రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో వంశీ మరోసారి చంద్రబాబు, లోకేష్‌ను టార్గెట్ గా చేసుకుని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.

ఈ క్ర‌మంలోనే వంశీ మాట్లాడుతుండ‌గా చంద్ర‌బాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఇక మాజీ హోం మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే చిన రాజప్ప తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వంశీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేటు వద్ద మీడియాతో మాట్లాడిన చిన‌రాజ‌ప్ప‌ వంశీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో చర్చ జరగకుడ‌ద‌ని గతంలో చెప్పిన స్పీకర్… సభలో వంశీకి సీటు ఇస్తున్న‌ట్టు ప్రశ్నోత్తరాల సమయంలో ఎలా చెపుతార‌ని రాజ‌ప్ప ప్ర‌శ్నించారు.

ఇక హైదరాబాద్‌లో ఆస్తులు, భూములు ఉన్న వంశీ వాటిని కాపాడుకోవడం కోసమే టిడిపిని వీడార‌ని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు ద‌య‌తో ఎమ్మెల్యే అయిన వంశీ… ఇప్పుడు తన పదవికి రాజీనామా చేస్తే ఓడిపోతానన్న భయంతోనే రాజీనామా చేయడం లేదని అన్నారు. వంశీకి ద‌మ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రతి ఇంటికి వెళ్లి పరామర్శించిన రోజా.. ఇప్పుడు వరుస‌గా రాష్ట్రంలో దాడులు జ‌రుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news