యావత్ భారతదేశం ఎదరుచూస్తున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభయ్యాయి. అయితే.. నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం విశేషం. దీంతో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టబోయే మహిళగా రికార్డు లిఖించారు. మరోవైపు.. వరుసగా నాలుగు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. ఇప్పటికే కొత్త కొత్త సంప్రదాయాలకు తెరదీశారు.
కేంద్ర బడ్జెట్ ప్రతుల్ని బ్రిటిష్ కాలం నుంచి ప్రవేశపెడుతుండగా.. 2018 వరకు దీనిని లెదర్ సూట్‌కేసులో మాత్రమే తీసుకొచ్చేవారు. అయితే 2019లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా తొలిసారే ఈ సంప్రదాయానికి చెక్ పెట్టారు. ఆమె ఈ బడ్జెట్ ప్రతుల్ని బాహీ ఖాతాగా పిలిచే ఎరుపు రంగ క్లాత్ బ్యాగ్‌లో తీసుకొచ్చారు. దీనిపై జాతీయ చిహ్నం ముద్రించి ఉంటుంది. దీంతో భారతీయ సంస్కృతికి తెరతీశారు.