బిజెపి ఎంపీకి నితిన్ గడ్కరీ సవాల్.. కిలో బరువు తగ్గితే వెయ్యి కోట్లు

-

ఓ బిజెపి ఎంపీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సవాల్ విసిరారు. ఆయన ఊబకాయాన్ని దృష్టిలో పెట్టుకొని బరువు తగ్గితే నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా తన నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని కోరారు. దానికి నితిన్ గడ్కరీ ఓ షరతు విధించారు.. తమరు బరువు తగ్గితే కిలో కి వెయ్యి కోట్ల చొప్పున నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని అనిల్ తో అన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ లోని మాల్వా ప్రాంతంలో రూ.5,772 కోట్ల విలువైన 11 రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మకోడియామ్ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. తాను 135 కేజీల నుంచి 93 కిలోలకు తగ్గానని.. కిలో చొప్పున బరువు తగ్గితే ఉజ్జయినీ అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news