థర్డ్ ఫ్రంట్ లేదు.. కాంగ్రెస్ తో సహా ఒకే కూటమి : నితీశ్ కుమార్

-

కాంగ్రెస్‌, లెఫ్ట్ సహా అన్ని విపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావాలని జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కోరారు. అలా ప్రతిపక్షాలన్నీ ఏకమైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘోరంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. తాను ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిని కానని తెలిపారు.

థర్డ్ ఫ్రంట్ అనే ప్రశ్నే లేదని.. కాంగ్రెస్​తో సహా ఒక ఫ్రంట్ ఉండాలని నితీశ్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పార్టీలు లేకుండా కూటమిని ఊహించలేమని అన్నారు. మాజీ ఉప ప్రధాని దేవిలాల్ జయంతిని పురస్కరించుకుని హరియాణాలోని ఫతేహాబాద్​లో ఐఎన్​ఎల్​డీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఇతర విపక్ష నేతలతో కలిసి పాల్గొన్నారు.

ఐఎన్​ఎల్​డీ నిర్వహించిన ఈ ర్యాలీలో నీతీశ్ సహా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శిరోమణి అకాళీదళ్​ నేత సుఖ్​బీర్ సింగ్ బాదల్, బిహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, శివసేన నేత అరవింద్ సావంత్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ తరపున ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.

Read more RELATED
Recommended to you

Latest news