కేసీఆర్ నెంబర్-1…ఇంకా సైడ్ అయితే బెటర్…!

-

రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడతాయని అంతా అనుకున్నారు. అలాగే ఉద్యమ పార్టీగా ఉన్న టి‌ఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, తెలంగాణని సాధించిన కే‌సి‌ఆర్ సి‌ఎంగా ఉండటంతో ఇంకా రాష్ట్రానికి తిరుగులేదని అనుకున్నారు. కానీ అనుకున్న స్థాయిలో కే‌సి‌ఆర్ పాలన వల్ల ప్రజల బ్రతుకులు బాగుపడినట్లు కనబడలేదు. ఉమ్మడి పాలనకు తీసిపోకుండానే కే‌సి‌ఆర్ పాలన ఉండటంతో తెలంగాణలో పెను మార్పులు ఏమి రాలేదు. పైగా కే‌సి‌ఆర్ రెండోసారి సి‌ఎం అయినా సరే రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదని తేలింది.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

తాజాగా ఓ సర్వేలో కే‌సి‌ఆర్ ఎక్కువగా ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని తెలిసింది. సీఎం కేసీఆర్‌పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని ఐఏఎన్‌ఎస్, సీ-ఓటర్‌ సర్వే వెల్లడించింది. ఇక దేశంలోనే ఎక్కువ ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న సి‌ఎం కే‌సి‌ఆర్ అని సర్వేలో తేలింది. దాదాపు 30.3% శాతంతో కే‌సి‌ఆర్ వ్యతిరేకత ఎదురుకుంటున్న సి‌ఎంల్లో నెంబర్-1 పొజిషన్‌లో ఉన్నారు. తర్వాత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి (28.1%), గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌(27.7%) ఉన్నారు.

ఇక విచిత్రం ఏంటంటే దేశ వ్యాప్తంగా అత్యధికంగా ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల్లో తెలంగాణ ఎమ్మెల్యేలు మూడో స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 103 మంది ఎమ్మెల్యేలు టి‌ఆర్‌ఎస్ వాళ్లే. అంటే టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఎక్కువ వ్యతిరేకత ఉందని క్లియర్‌ కట్‌గా తెలుస్తోంది. అంటే టోటల్‌గా టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటుందని అర్ధమవుతుంది.

దీని బట్టి చూస్తే నెక్స్ట్ ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్‌కు ప్రజలు షాక్ ఇవ్వడం గ్యారెంటీ అని తెలిసిపోతుంది. అయితే దీనికి విశ్లేషకులు ఒక సోల్యూషన్ కూడా చెబుతున్నారు. కే‌సి‌ఆర్ సైడ్ అయ్యి కే‌టి‌ఆర్‌ని సి‌ఎం చేస్తే కాస్త మార్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో కే‌టి‌ఆర్ సి‌ఎం అభ్యర్ధిగా ముందుకెళితే కాస్త ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికైతే కే‌సి‌ఆర్ సైడ్ అయితే బెటర్ అని అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news