ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతోంది! అగ్రరాజ్యం, పేద దేశం అనే తారతమ్యాలు కరోనాకు పట్టడం లేదు.. అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందుతోన్న దేశం అన్న బేధాలు కోవిడ్ పరిధిలోకి రావడంలేదు! ఈ తరుణంలో… గతకొన్ని రోజులుగా అన్ని విమర్శలూ అయిపోయాయో ఏమో కానీ… జగన్ పై ఒక విమర్శను చేస్తూ వస్తున్నాయి ప్రతిపక్షాలు, వాటి అనుకూల పత్రికలు!
అవును… జగన్ బయటకు రావడం లేదు సరికదా.. మాస్క్ ధరించడం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే మాస్క్ ధరించకపోతే ఇంక జనాలకు ఏమి చెబుతారు. జనాలకు చెప్పాలంటే ముందు జగన్ కూడా పాటించాలి, మాస్క్ ధరించాలి అని! అయితే… ఈ విషయాలపై వైకాపా నేతలనుంచి రావాల్సిన సమాధానాలు వచ్చేసేసరికి.. ప్రతిపక్షాలు మౌనం వహించాయి! అయితే తాజాగా రామోజీ రావు కూడా మాస్క్ ధరించకుండా ఉన్న ఫోటోలు ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి.
ఈటీవీ రజతోత్సవ కార్యక్రమాన్ని రామోజీ ఫిలింసిటీలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన గ్రూపు ఛైర్మన్ రామోజీ రావు ముఖానికి మాస్కు పెట్టుకోలేదు! ఈనాడు ఎండీ కిరణ్ ఆయన సతీమణి శైలజా కిరణ్ లు ముఖానికి మాస్కులు పెట్టుకోగా.. రామోజీ మాత్రం అందుకు భిన్నంగా మాస్కు పెట్టుకోకుండా కార్యక్రమం మొత్తం మామూలుగా ఉన్నట్లు తాజాగా విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.
కరోనా మహమ్మారిపై భారీ ఎత్తున వార్తలు అందించే ప్రముఖ మీడియా అధినేత ముఖానికి మాస్కు లేకుండా ఉండటంపై సర్వత్రా కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో తాను తీసుకునే జాగ్రత్తలు తాను తీసుకుంటూ జగన్ మాస్క్ ధరించకపోతే.. .దానిపై రాద్ధాంతం చేసిన పెద్దలు, వారి మద్దతు దారులు ఇలా మాస్క్ లేకుండా కనిపించడం ఏమిటంటూ… కామెంట్లు పడుతున్నాయి!! ఈ విషయంలో మాత్రం జగన్ – రామోజీ సేం టు సేం అంటూ కీ బోర్డ్ కి పనిచెబుతున్నారు నెటిజన్లు!!