ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ మేమే గెలుస్తాం : మంత్రి కోమటిరెడ్డి

-

బీఆర్ఎస్ ఎన్నికుట్రలు చేసినా తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి కోమటిరెడ్డి జహీరాబాద్ లో ఉజ్వల్ రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వెంటనే ప్రభుత్వాన్ని పడగొట్టి రాజులై, యువరాజులై ధరణి లాంటి లోపు భూయిష్ట చట్టాలతో రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఏం ఢోకా లేదని.. మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్ కు అదేవిధంగా మున్సిపాలిటీ అప్రోచ్ కు రోడ్లన్నింటినీ బీటీగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ కు వచ్చే రోడ్డు ను డబుల్ రోడ్డులుగా వచ్చే నాలుగేళ్లుగా నిర్మిస్తామన్నారు. రూ.15కోట్లతో నియోజకవర్గంలో చిరాగ్ పల్లి నుంచి మన్నపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి టెండర్ పూర్తయిందని.. వారం లోపు పనులు ప్రారంభిస్తామన్నారు. రూ.32కోట్లతో ఎల్గొయి నుంచి జహీరాబాద్ వరకు, రూ.25 కోట్లతో అసద్ గంజ్ నుంచి జాతీయ రహదారి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శాంక్షన్ తీసుకుంటామన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news