ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరం లేదు? ఇంట్లోనే సులువుగా చెయ్యొచ్చు..

-

డబ్బులను పొదుపు చెయ్యాలనుకునేవారికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తుంది.. ముఖ్యంగా చెప్పాలంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ చాలా బెస్ట్ అని చెప్పాలి..సేవింగ్ ఖాతాతో పోలిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ వస్తుండటంతో వీటిపైనే ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ సేవలను పొందాలంటే గతంలో నేరుగా బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి రావడంతో బ్యాంకు ఖాతా తెరవడం మొదలు ఫిక్స్‌డ్ డిపాజిట్ వరకు అన్ని బ్యాంకుకు వెళ్లకుండానే పూర్తి చేసుకునేందుకు అవకాశం లభించింది. ఈ క్రమంలనే దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఖాతాదారులకు ఆన్‌లైన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెరిచే సౌలభ్యాన్ని కల్పించింది… బ్యాంకుకు వెళ్లే పనిలేకుండా వెయిట్ చెయ్యకుండా డిపాజిట్ ను తీసుకోవచ్చు.. ఇక ఆన్లైన్లో ఎఫ్డి ని తీసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం..

పూర్తి వివరాలు…

*. ముందుగా ఎస్‌బిఐ అధికారిక వెబ్ సైట్ www.onlinesbi.sbiను సందర్శించాలి. అయితే ఇందుకోసం మీరు తప్పనిసరిగా నెట్‌బ్యాంకింగ్‌ని కలిగి ఉండాలి. లేదంటే నెట్‌ బ్యాంకింగ్ సేవల కోసం నమోదు చేసుకోవాలసి ఉంటుంది.
*. నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ కావడానికి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేయాలి.
*. హోమ్ పేజీ ఎంపిక కింద డిపాజిట్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. డిపాజిట్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత వాటిలో టర్మ్ డిపాజిట్ ఎంపికను ఎంచుకుని, ఆపై e-FDని సెలక్ట్ చేసుకోవాలి.
*. అక్కడ మీకు కనిపిస్తున్నావాటిలో కావలిసిన పథకాన్ని ఎంచుకొని.. ఆ తర్వాత ప్రొసీడ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి.
*. ఏ ఖాతా నుంచి డబ్బులను ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో జమ చేయాలో నిర్ణయించుకోవాలి.
*. ఎంత మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. వృద్ధులు అయితే సీనియర్ సిటిజన్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ రేట్లు వేరుగా ఉంటాయి.
*. ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితి, మ్యెచురిటీ తేదీని సెలక్ట్ చేసుకోవాలి. చివరిగా టర్మ్స్‌ అండ్ కండీషన్స్ తెలుసుకుని అక్కడి ఆప్షన్ టిక్ చేయాలి.
*. ఆ తర్వాత సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేసిన వెంటనే సులభంగా ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెరవవచ్చు.ఇలా చాలా సులువుగా ఆన్లైన్లో ఖాతాను తెరావొచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news