అంతా ఫేక్‌ న్యూస్‌.. ఎయిరిండియా అమ్మకంపై కేంద్రం క్లారిటీ

-

ఎయిరిండియాపై ఇవాళ ఉదయం నుంచి ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. ఎయిర్‌ ఇండియా… 68 సంవత్సరాల అనంతరం అసలు యజమాని టాటా గ్రూప్‌ చేతికి వెళ్లిందని వార్తలు వస్తున్నాయి. అయితే… దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అత్యధిక బిడ్‌ దాఖలు చేసిన టాటా గ్రూప్‌ ఎయిర్‌ ఇండియా ను తిరిగి సొంతం చేసుకున్నదని… బ్లూమ్‌ బర్గ్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ… ఎయిరిండియా పెట్టుబడుల ఉప సంహరణలో ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆమోదించిందన్న మీడియా వార్తల్లో నిజం లేదని.. ఆర్తిక శాఖ ఓ ట్వీట్‌ లో వెల్లడించింది. దీనిపై నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వమే… మీడియాకు చెబుతుందని క్లారిటీ ఇచ్చింది కేంద్ర సర్కార్‌. కాగా.. గత నెలలో ఈ ఎయిరిండియా కోసం టాటా గ్రూప్‌ తన బిడ్‌ దాఖలు చేసింది. గతేడాది డిసెంబర్‌ లో ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించగా… నలుగురు మాత్రమే ముందుకు వచ్చారు. అందులో టాటా గ్రూప్‌ మాత్రమే చివరి వరకూ రావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news