లాక్ డౌన్ లో బయటకు వచ్చిన వాళ్లకు ఈ శిక్షలు వేయండి…

-

లాక్ డౌన్ లో బయటకు వస్తున్నారా…? పోలీసులు చెప్తున్నా సరే ఎవరూ కూడా వినడం లేదా…? ఎంత చెప్పినా సరే మారే అవకాశం కనపడటం లేదా…? అయితే మనలోకం ఒక సలహా ఇస్తుంది పోలీసులకు.

బయటకు వచ్చిన వాళ్ళను ముందు గుర్తించి… ఎవరి మీద లాఠీ చార్జ్ చేయకండి.

వాళ్ళను జైలుకి గాని బండి స్వాధీనం చేసుకోవడం గాని కేసులు పెట్టడం గాని చేయకండి.

వచ్చిన వాళ్ళు అందరికి మాస్క్ లు ఇవ్వండి. చేతి గ్లౌజులు ఇవ్వండి. అధికారుల అనుమతి తీసుకుని ఐసోలేషన్ వార్డులకు తరలించండి. అక్కడి రోగులకు వాలంటీర్లు గా… అంటే వాళ్లకు ఆహారం అందించడం, వైద్యులకు పరికరాలు అందించడం.

ఆస్పత్రుల్లో క్లీనింగ్ పనులు, ఐసోలేషన్ వార్డుల్లో క్లీనింగ్ చేయించడం, వైద్యులు వాడిన వస్తువులను బయటకు తీసుకు రానీయడం,

అలాగే రెండు రోజుల పాటు ప్రధాన చౌరస్తాలో ఉంచి కరోనా మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేయించడం, పదే పదే బయటకు వస్తున్న వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించి అక్కడ ఉండే వాళ్ళ సదుపాయాలను ఏ ఇబ్బంది లేకుండా చూడటం.

ఇలా నాలుగు రోజుల పాటు చేసిన తర్వాత వాళ్ళను మరో 28 రోజులు క్వారంటైన్ లో ఉంచడం. ఇలా ఒక పది మందిని చేసి ఆ తర్వాత ప్రాంతానికి ఒకరిని గుర్తించి తీసుకుని వెళ్తే మారే అవకాశం ఉంటుందని మా అభిప్రాయం.

వారి వద్ద ఫోన్ గాని మరొకటి గాని లేకుండా వాళ్ళను కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించాకుండా చేయండి.

ఇక మున్సిపల్ సిబ్బంది చేస్తున్న పనులను వారితో కూడా చేయించండి. కరోనా రోగులతో డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టండి.+

Read more RELATED
Recommended to you

Latest news