గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సమందించి రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఈ రోజే అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. గ్రేటర్ లోని 150 డివిజన్లకు సంబంధించి నిన్న 20 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజు సుమారు 500 పైచిలుకు నామినేషన్లు దాఖలు అయ్యాయని చెబుతున్నారు. ఇప్పటికే ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేసినట్లు సమాచారం అందితోంది.
రెండో రోజు అధిక సంఖ్యలో అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసుకు రావడం తో మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. సాయంత్రం ఆరు గంటల దాకా కూడా ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఇక రేపు నామినేషన్ దాఖలుకు చివరి రోజు కావడంతో మరింత భారిగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ముందు జాగ్రత్తగా ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఒక వేళ ప్రధాన అభ్యర్థి నామినేషన్ చెల్లకపోతే ఈ డమ్మీ అభ్యర్ధులే ప్రధాన అభ్యర్ధులు కానున్నారు.