కోడిగుడ్డు తో లాభాలు మాత్రమే కాదు అంతకుమించీ..?

-

చౌక ధరలో అందుబాటులో ఉండే పోషకాహారం కోడిగుడ్డు. గుడ్డు ఆరోగ్యాన్ని పెంచడమే కాదు మనకు సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. గుడ్డును ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక జబ్బుల నుండి రక్షించుకోవచ్చు. ఇందులో విటమిన్ ఎ,విటమిన్ ఇ, డి, కె , బి6, బి12 తో పాటు క్యాల్షియం, ఐరన్, జింక్ థయామీన్, ఫోలిక్ యాసిడ్,పొటాషియం,కాపర్, మెగ్నీషియం ఇంకా అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. గుడ్డును ఉడకబెట్టుకొని తినాలి..ఉడికించిన గుడ్డు తినడం ద్వారా మనకు లభించే పోషకాలు, వాటితో కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మకాంతిని పెంచుతుంది :
ఇందులో విటమిన్ ఇ చర్మకాంతిని పెంచేందుకు దోహదపడుతుంది. ప్రతిరోజు గుడ్డును తీసుకుంటే అందులోని ప్రోటీన్లు మన చర్మ కణాలను శుద్ధిచేసి.. చర్మానికి మెరుపులు తీసుకువస్తాయి. గుడ్డును ఫేస్ ప్యాక్గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కంటి సమస్యలను దూరం చేస్తుంది:
గుడ్డులో కెరటోనాయిడ్లు, ల్యూటిన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి కంటికి సంబంధించిన వ్యాధులను దూరం చేస్తాయి. గుడ్డులో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.

జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది :
ప్రతిరోజు గుడ్డును ఆహారంలో తీసుకోవడం వల్ల మన జుట్టు పెరుగుదలను పెంచుకోవచ్చు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. గుడ్డును తలకు అప్లై చేయడం ద్వారా అందమైన కురులను సొంతం చేసుకోవచ్చు.

గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు కోడిగుడ్డు తీసుకోవడం వల్ల బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. గర్భం దాల్చాలి అనుకునే వారు కూడా కోడిగుడ్డు ప్రతిరోజు తీసుకోవడం చాలా మంచిది. ఇక వీటితోపాటు మరెన్నో అనారోగ్య సమస్యలను కోడిగుడ్డు ద్వారా దూరం చేసుకోవచ్చు. ఈ కోడి గుడ్డు వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదు సౌందర్య ప్రయోజనాలు కూడా పొందవచ్చని నిపుణులు నిరూపించారు . కాబట్టి ప్రతిరోజు ఒక కోడిగుడ్డును మీ ఆహారంలో చేర్చుకొని ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news