ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో నిద్రలేమి కూడా ఒకటి. నిద్ర పటక చాలా మంది సతమతమవుతూ ఉంటారు. కానీ నిజానికి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర కూడా అవసరం. ఎలా అయితే ఆరోగ్యానికి మంచి ఆహారం, వ్యాయామం ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. పైగా నిద్ర బాగా పడితేనే అన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. మంచి నిద్రని పొందాలంటే కచ్చితంగా ఈ టిప్స్ ని ఫాలో అవ్వాలి. ఇలా కనుక మీరు అనుసరిస్తే ఖచ్చితంగా హాయిగా నిద్రపోవచ్చు.
సాయంత్రం స్నానం చేయండి:
రోజు సాయంత్రం స్నానం చేస్తే కచ్చితంగా నిద్ర బాగా పడుతుంది. నిద్ర పట్టని వాళ్ళు ఈ
టిప్ ని అనుసరించి చూడండి.
ఒత్తిడి ఉండకూడదు:
మంచి నిద్రని పొందాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి ఒత్తిడి లేకుండా మెడిటేషన్ వంటి పద్ధతుల్ని ఫాలో అవ్వాలి.
బ్యాలెన్స్ డైట్ తీసుకోండి:
నిద్ర పట్టకపోయినట్లయితే సమతుల్యమైన ఆహారం తీసుకోండి మీరు తీసుకునే ఆహారం బట్టి కూడా మీ యొక్క నిద్ర ఆధారపడి ఉంది. పైగా ఇది త్వరగా జీర్ణం అవుతుంది.
మంచి పుస్తకాన్ని చదవండి:
రాత్రి నిద్ర పట్టాలంటే ఒక పుస్తకాన్ని తీసి చదవండి అప్పుడు కచ్చితంగా నిద్ర పడుతుంది.
టీ కాఫీలకి దూరంగా ఉండండి:
సాయంత్రం అయిపోయిన తర్వాత టీ కాఫీలు తీసుకోకండి. టీ కాఫీలకి దూరంగా ఉంటే నిద్ర బాగా పడుతుంది. చూశారు కదా మంచి నిద్ర పట్టాలంటే ఏం చేయాలి అని… మరి నిద్ర పట్టాలనుకునేవారు కచ్చితంగా వీటిని ఫాలో అయ్యి హాయిగా నిద్రపోండి.