తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని గురుకులాల్లో కలిపి త్వరలోనే 11 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని గురుకుల నియామక బోర్డు నిర్ణయించింది.
ఈ ఏడాది మంజూరైన 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో కేబినెట్ ఆమోదించిన 2,591 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి వచ్చిన వారం రోజుల్లో నోటిఫికేషన్ రానుంది. ప్రభుత్వం ఇప్పటికే 9,096 పోస్టులను మంజూరు చేసింది. అదనపు పోస్టులతో కలిపి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వనుంది.