చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్.. మామయ్య అంటూ ట్వీట్

-

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. అతిరథ మహారధుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. ప్రముఖ రచయిత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ పాటలో ఎన్టీఆర్ రామ్ చరణ్ వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించాయి.

ఈ అవార్డు రావడంతో అందరూ ఎస్.ఎస్ రాజమౌళిని, అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవానిని తెగ పొగిడేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వేసిన ఓ ట్వీట్.. దానికి ఎన్టీఆర్ ఇచ్చిన రిప్లై ఆసక్తికరంగా మారింది. ఆర్ఆర్ఆర్ టీం ని మెచ్చుకుంటూ తెలుగు భాషకు మరింత గౌరవాన్ని పెంచారంటూ చంద్రబాబు ట్వీట్ వేశారు. దీనికి ఎన్టీఆర్ థాంక్యూ సో మచ్ మామయ్య అంటూ రిప్లై ఇచ్చారు. అయితే చంద్రబాబు తన ట్వీట్ లో ఎన్టీఆర్ ను ప్రస్తావించకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news