మీ పుట్టిన తేదీ మీ కెరీర్ ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

-

సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ కెరీర్ ని ప్రభావితం చేస్తుంది. దీన్ని మూడు రకాలుగా చూస్తారు. మొదటగా,

పుట్టిన తేదీ:

మీ పుట్టిన తేదీని తీసుకుని అందులోని అంకెలను కలిపితే సింగిల్ డిజిట్ గా వస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ఉదాహరణకి మీ పుట్టిన తేదీ 14 అనుకుంటే, అందులోని అంకెలను కలపగా 5సంఖ్య వస్తుంది.

మాస్టర్ నంబర్

మీ పుట్టిన తేదీలో 11, 22 వంటివి ఉన్నట్టయితే వాటిని మాస్టర్ నంబర్స్ అంటారు. ఈ నంబర్లని సింగిల్ డిజిట్ కి కన్వర్ట్ చేయాల్సిన పనిలేదు. ఉదాహరణకి మీ తేదీ 29అయితే వాటిల్లోని అంకెలను కలపగా 11వస్తుంది. అప్పుడు అది మాస్టర్ నంబర్ అవుతుంది.

న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీకి ఎలాంటి కెరీర్ ఉంటుందో చూద్దాం.

నంబర్ 1: వీరు దేనినైనా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటారు. తమ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుకోవాలో వారికి బాగా తెలుసు. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. సీఈవో, ఆర్మీ ఆఫీసర్, కమాండర్, పొలిటికల్ ఆఫీసర్ వంటి రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు.

నంబర్ 2:

మీ తేదీలో అంకెలను కలపగా నంబర్ 2వచ్చినట్లయితే, మీరు క్రియేటివ్ అని అర్థం చేసుకోవాలి. డిజైనర్, ఆర్టిస్ట్, క్రియేటివ్ రైటర్ గా ఎదుగుతారు. మృదు స్వభావం ఉండడంతో మంచి మధ్య వర్తులుగా ఎదుగుతారు.

నంబర్ 3:

వీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇతరులతో ఈజీగా కలిసిపోతారు. ఇతరులకు ఆనందం పంచడంలో ముందుంటారు. వినోద రంగం వీరికి బెస్ట్ ఆప్షన్.

నంబర్ 4:

నంబర్ 4 కలిగిన వ్యక్తులు వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. డబ్బు విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు. కష్టపడి సంపాదించాలనే అనుకుంటారు.

నంబర్ 5:

వీరు స్మార్ట్ వర్క్ ని ఇష్టపడతారు. వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగి ఉండి, యాక్టింగ్ , మ్యూజిక్, జర్నలిజం, లా, ఫిలిం మేకింగ్ రంగాల వైపు అడుగులు వేస్తారు.

నంబర్ 6:

కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించి, ఇతరులతో గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు. బంధువులు, స్నేహితులతో చాలా సన్నిహితంగా మెలుగుతారు. అర్కిటెక్ట్, ఫ్యాషన్ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్ వంటి రంగాల్లో రాణిస్తారు.

నంబర్ 7:

వీరు ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటారు. ఇంట్రావర్ట్ గా ఉంటూనే అన్నీ గమనిస్తూ ఉంటారు. రైటర్, టీచింగ్ వంటి రంగాల్లో రాణిస్తారు.

నంబర్ 8:

ఈ నంబర్ వ్యక్తులు డబ్బుతో సంబంధం కలిగి ఉంటారు. అందుకే ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, బ్యాంకింగ్ రంగాల్లో వీరికి కెరీర్ అభివృద్ధి ఉంటుంది.

నంబర్ 9:

ఈ నంబర్ వ్యక్తులు మానవత్వాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. అందువల్ల నేవీ, ఆర్మీ, పోలీస్ డిపార్ట్ మెంట్ మొదలగు వాటివైపు చూస్తారు. అంతేకాదు విజయవంతమైన క్రీడాకారులుగా ఎదుగుతారు.

మాస్టర్ నంబర్ 11

వీరు ఆధ్యాత్మికతని ఎక్కువగా నమ్ముతారు. ఆధ్యాత్మిక గురువుగా మారి శిష్యులకు బోధన కూడా చేస్తారు. టీచింగ్, కౌన్సిలింగ్, వంటి రంగాల్లో వీరి అభివృద్ధి ఉంటుంది.

మాస్టర్ నంబర్ 22

వీరు ఎంచుకున్న రంగాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. వీరు ఏది చేసినా పెద్ద ఎత్తున చేయాలని భావిస్తారు. రాజకీయం, పారిశ్రామిక రంగాల్లో వీరు రాణిస్తారు.

మాస్టర్ నంబర్ 33

కళలను నమ్ముకుని దాని కోసమే పనిచేయడంలో వీరు ముందుంటారు.

మాస్టర్ నంబర్ 44:

తమ జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించే పట్టుదల వీరిలో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news