టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చాలా సార్లు వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. కాగా, ఆయన సవాల్‌ను ప్రభుత్వం ఏనాడు సీరియస్‌గా తీసుకోలేదు. అయితే, ఏదో ఒక విషయమై ప్రభుత్వం చేతిలో అరెస్టు కావాలని లోకేశ్ చాలా కాలం నుంచి అనుకుంటుండగా, తాజాగా గుంటూరు పోలీసులు లోకేశ్‌ను అరెస్టు చేశారు. గుంటూరులో హత్యకు గురైన బీటెక్ స్టూడెంట్ రమ్య విషయంలో జరిగిన ఆందోళనలో టీడీపీ శ్రేణులతో లోకేశ్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు లోకేశ్‌ను అరెస్టు చేశారు.
ఆ తర్వాత ఆయన్ను బెయిల్‌పై విడుదల చేశారు. అయితే రమ్య హత్య కేసులో ప్రతిపక్షాల ఆందోళన అనవసరమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రమ్య హత్య వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మృతురాలికి ఆమె ప్రియుడితో జరిగిన గొడవల కారణంగా హత్య జరినట్టు కొందరు పేర్కొంటున్నారు. అయితే, రమ్యకు న్యాయం చేయాలని టీడీపీ, వామపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. కాగా, రమ్య మృతికి కారణమైన శశిధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మృతురాలి కుటుంబానికి జరిగిన నష్టానికి పరిహారంగా వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారం కూడా అందచేసింది. నిందుతుడిని కఠినంగా శిక్షించాలన్న కుటుంబసభ్యుల డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. మొత్తంగా సమస్య పరిష్కారానికి జగన్ సర్కారు ప్రయత్నిస్తున్న క్రమంలోనే రాజకీయ పార్టీలైన టీడీపీ, వామపక్షాలు ఇవేవీ పట్టించుకోకుండానే ఆందోళనకు దిగుతున్నాయని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఏదైతేనేమి లోకేశ్ ఎప్పటి నుంచో పోలీసుల చేతిలో అరెస్టు కావాలని భావిస్తుండగా, తాజాగా అరెస్టై తన కోరిక నెరవేర్చుకున్నట్లయింది. అయితే, అరెస్టు అయిన కొంత సమయం తర్వాతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బెయిల్ మీద బయటకు వచ్చారు.