ఓట్స్ మిల్క్ ను ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..టేస్టీతో పాటూ హెల్తీ..!

-

ఓట్స్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరు. బరువు తగ్గాలనుకునే వాళ్లైతే..కచ్చితంగా తమ డైట్ లో ఓట్స్ ను చేర్చుకుంటారు. అలాగే ఓట్స్ మిల్క్ ని కూడా. అయితే ఓట్స్ మిల్క్ ను తాగాలంటే..ప్యాకెట్ పాలను కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ మిల్క్ ను తయారుచేసుకోవచ్చు మీకు తెలుసా. ఎలా చేయాలో చూద్దాం.

ఓట్‌మిల్క్‌ తయారీ విధానం..

ఒక పెద్ద గిన్నెలో ఒకటిన్నర కప్పుల ఓట్స్, 5 కప్పుల నీరు తీసుకోని బాగా కలపండి. ఇందులో చిటికెడు ఉప్పు వేయాలి. కాసేపటి తర్వాత దీన్ని కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. మీరు తయారు చేసిన ఓట్‌మిల్క్‌ తీపిగా ఉంటే, దానికి కొంచెం స్టీవియా, చక్కెర లేదా చెరుకు రసం కలుపుకోవచ్చు. పాలకు మంచి ఫ్లేవర్‌ కావాలంటే వెనీలా ఎసెన్స్‌ కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ గ్రైండ్‌ చేయాలి.

పాలు మెత్తగా, క్రీము వచ్చే వరకు గ్రైండ్‌ చేయండి. ఆ తర్వాత దాన్ని వడకట్టి పాలను తీయాలి. ఈ పద్ధతిలో మీరు 5 కప్పుల వరకు ఓట్‌ మిల్క్‌ వస్తుంది. ఓట్‌ మిల్క్‌ డెయిరీ మిల్క్‌ మాదిరిగా ఉంటుంది. అందువల్ల గ్రైండింగ్‌ చేసేటప్పుడు పాలు ఏర్పడే వరకు మెత్తగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.. ఓట్‌మిల్క్‌ వేడి, రుచిగా ఉంటుంది. కాబట్టి వీటిని వేడి చేయకుండానే తాగితే మంచిది.

నిల్వ చేసుకునే విధానం..

ఓట్ మిల్క్ ను చేసుకోగానే సరిపోదు..దానిని నిల్వచేసుకోవటం కూడా ముఖ్యమే..చేసిన మిల్క్ అంతా ఒకేసారి తాగేయలేం కదా..కాబట్టి జాగ్రత్తగా నిల్వచేసుకోవాలి. గాలి రాని ఒక కంటైనర్ లో నిల్వచేసుకోవాలి. గాజుది అయితే ఇంకా బెటర్. ఓట్‌ మిల్క్‌ కంటైనర్‌ను పొడి ప్రదేశంలో లేదా రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవాలి.

ఇంట్లో తయారు చేసిన ఓట్స్‌ మిల్క్‌ను చేసిన రెండు రోజులలోపు తీసుకోవాలి. ఈ పాలను స్మూథీస్, షేక్స్, కోల్డ్‌కాఫీల్లో కలిపి తాగితే మరింత రుచిగా ఉంటాయి. ఈ ఓట్‌ మిల్క్‌ను ఉపయోగించే ముందు బాగా షేక్‌ చేసి అప్పుడే వాడుకోవాలి.

సో ఇదీ ఓట్ మిల్క్ చేసుకునే ప్రాసెస్..ఎప్పుడూ బయటనుంచే ఏం తెస్తాం అనుకుంటే..ఓ సారి ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news