రాష్ట్ర మంత్రులను అభినందించిన ప్రజాప్రతినిధులు , అధికారులు…

-

తెలంగాణ సుపరిపాలనలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నాలుగు కోట్ల ప్రజానీకం ఆకాంక్షలను నెరవేర్చేలా… ఆత్మగౌరవ ప్రతీకగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తూర్పున ఉన్న ప్రధాన ద్వారం గుండా సచివాలయానికి వచ్చిన సీఎం.. తెలంగాణ పాలనాసౌధాన్ని ప్రారంభించారు. సుముహుర్తాన్న కార్యాలయంలోని సీట్లో కూర్చున్న ముఖ్యమంత్రి… ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ దస్త్రంపై తొలి సంతకం చేశారు. మంత్రులు, అధికారులు సీఎంను అనుసరించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి కి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జడ్పీ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, గుజ్జ దీపికా యుగంధర్ రావు ,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ పూలబోకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Telangana | మంత్రులను అభినందించిన ప్రజాప్రతినిధులు , అధికారులు

వీరితో పాటు శాసన సభ్యులు గాధరి కిశోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, నేనావత్ రవీంద్ర నాయక్, నోముల భగత్, యన్.భాస్కర్ రావు,శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,ఫైళ్ల శేఖర్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ లు తిప్పన విజయసింహ రెడ్డి,సోమా భరత్ కుమార్ తదితరులు మంత్రికి అభినందనలు తెలిపారు. మరో చాంబర్‌లో ఎస్సీ అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి స్నేహలత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ ఎల్. రమణ, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, రాష్ట్ర పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటీ దామోదర్ గుప్తా, ఉమ్మడి కరీంనగర్ డి.సి.ఎం.ఎస్. చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, రామగుండం మేయర్ అనిల్ తదితరులు మంత్రిని అభినందించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news