శుద్ధ తిరుమలగా ఉండాలని పారిశుధ్య కార్మికుల సమ్మె..పరిసరాలను శుభ్రం చేసిన అధికారులు,ఉద్యోగులు

-

తిరుపతిగత వారం నుండి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, నోటిసు ఇవ్వకుండా టిటిడి సులభ కార్మికులు ఆకస్మిక సమ్మెలోకి వెళ్ళిన నేపధ్యంలో శ్రీవారి భక్తులు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టిటిడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టి తిరుమలలో పారిశుధ్య పనులు చేస్తుంది. అయితే పారిశుధ్య కార్మికుల సమ్మె ముగిసినా విధులకు హాజరు కాక‌పోవడంతో టిటిడి ఉద్యోగులలో స్పూర్తి నింపడానికి స్వచ్చ తిరుమల కార్యక్రమంను టిటిడి చేపట్టింది. ఈ కార్యక్రమంలో స్వయంగా టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి, తిరుపతి‌ జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డిలు పాల్గోని తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు.

Tirumala | తిరుమలలో పారిశుధ్య కార్మికుల సమ్మె..పరిసరాలను శుభ్రం చేసిన అధికారులు,ఉద్యోగులు

క్లిష్ట సమయంలో తమ సంస్థ ప్రతిష్ట కాపాడుతూ భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సేవలందించేందుకు ఉద్యోగులు ముందుకురావడం అభినందనీయమని అన్నారు. భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి ఉద్యోగులు యాజమాన్యానికి అవసరమైన ప్రతి సందర్భంలో అండగా నిలవాలని ఆయన కోరారు శుద్ధ తిరుమల- సుందర తిరుమలగా తయారు చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు .

 

 

Read more RELATED
Recommended to you

Latest news