మేకప్ తీసివేయడానికి కావాల్సిన ఆయిల్ క్లీన్సింగ్ గురించి తెలుసుకోండి..

-

మేకప్ వేసుకోవడానికి ఎంత సమయం పడుతుందో తీసివేయడానికి కూడా అంతే సమయం పడుతుంది. కానీ కొందరు, దానంతట అదే మేకప్ చెరిగిపోతుందని భావిస్తారు. అలా అనుకుంటే పొరపాటే. మేకప్ తీసివేసుకోకుండా అలానే నిద్రపోతే అనేక చర్మ సమస్యలకి దారి తీసి వారవుతారు. అందుకే రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా మేకప్ తీసేయాలి. మేకప్ తీసేసి ముఖాన్ని శుభ్రంగా ఉంచుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే చర్మ కణాలు మూసుకుపోయి నల్ల మచ్చలు, మొటిమలు వంటివి ఏర్పడే అవకాశం ఉంది.

ఐతే మేకప్ తీసివేయడానికి కొన్ని ఆయిల్స్ బాగా పనిచేస్తాయి. మీ చర్మ రకాన్ని బట్టి ఏ ఆయిల్ మీకు సూటవుతుందో తెలుసుకుంటే బెటర్.

ఆయిల్ స్కిన్: ఆముదం నూనె, లావెండర్ ఆయిల్ తో మేకప్ తీసేసుకోవచ్చు.

పొడి చర్మం: ఆముదం నూనె, ఆలివ్ ఆయిల్, రోజ్ మేరీ ఆయిల్స్ బాగా పనిచేస్తాయి.

మేకప్ తీసివేసే పద్దతి:

మీ చర్మ రకాన్ని బట్టి మీకు నచ్చిన ఆయిల్ ని తీసుకుని దాన్ని చేతులకి బాగా రాసుకుని మీ మేకప్ తీసివేయాలనుకున్న చోట బాగా రుద్దాలి. మీ మేకప్ చెరిగిపోయిందనే ఫీలింగ్ వచ్చే వరకు అలా చేస్తూ ఉండాలి. మేకప్ తొలగిపోయినపుడు మీకు తెలుస్తుంది.

ఆ తర్వాత ఒక చిన్న గుడ్డ తీసుకుని దాన్ని గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి ముఖంపై వేసుకోవాలి. అలా కొద్ది సేపు ఉంచి, తుడిచేస్తే చర్మ కణాలు మూసుకుపోకుండా ఉంటుంది. అప్పుడు చర్మ సమస్యలు రాకుండా ఉంటుంది. మేకప్ తీసివేయడానికి ఆయిల్ తో చేసే క్లీనింగ్ ఇదే.

రెగ్యులర్ గా మేకప్ వేసుకునే మీకు చర్మం సురక్షితంగా ఉండాలంటే ఇలాంటి విషయాలు తప్పనిసరి.

Read more RELATED
Recommended to you

Latest news