న్యూఢిల్లీ: ఆయిల్ ధరలు షాకిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ ప్రజలపై గుదిబండగా మారుతుననారు. శుక్రవారం పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు పోటాపోటీగా పెరిగాయి. జైపూర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.18గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 98.59గా కొనసాగుతోంది. ఆయిల్ ధరలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలపై ఈ ధరలు తీవ్ర ప్రభావం చూపడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతున్నారు.
వివిధ నగరాల్లో పెట్రోల్ ధర ఇవే:
ముంబై : లీటర్ పెట్రోల్ రూ.104.90, డీజిల్ రూ.96.72
చెన్నై: లీటర్ పెట్రోల్ రూ.100.13 డీజిల్ రూ.93.72
బెంగళూరు: లీటర్ పెట్రోల్ రూ.102.48, డీజిల్ రూ.94.54
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ.103.05, డీజిల్ రూ.97.20
విజయవాడ: లీటర్ పెట్రోల్ రూ.105.26, డీజిల్ రూ.98.80
విశాఖపట్నం: లీటర్ పెట్రోల్ రూ.104.96, డీజిల్ రూ.98.07