పవన్ కల్యాణ్‌కు కార్లు అంటే చాలా ఇష్టం. ఇందుకోసం ఆయన ఎంత మొత్తాన్నైనా వెచ్చిస్తారని ఆయన సన్నిహితులు చెప్పే మాట. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ ఓ లగ్జరీ కారును బుక్ చేశారట. ఎస్ యూపీ రేంజ్ రోవర్ 3.0 మోడల్ కారుపై ఆయన మనసు పడ్డారట. దీని ఖరీదు రూ. 4 కోట్ల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. వన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఎక్కువ దూరం ప్రయాణాలకి ఇది సౌకర్యవంతంగా ఉంటుందని కాస్ట్ లీ కారు కొనుగోలు చేశారట.
ఇటీవల కరోనా నుండి కోలుకున్న ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’, ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ చిత్రాలతో నటిస్తున్నారు. కొందరు సినీ ప్రముఖులకు ఇలాంటి లగ్జరీ కారు ఉండగా, ఇప్పుడు పవన్ కూడా వారి జాబితాలో చేరిపోతుననారు. అయితే ఇది ప్రచారం మాత్రమే. అధికారికంగా పవన్ సన్నిహితులు స్పందిస్తారేమో చూడాలి.