వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వ్యాపారస్థులు కప్పం కట్టే దుస్థితి ఏర్పడుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. డోన్‌లో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…’జగన్ గత ఎన్నికల్లో కోడికత్తి, ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు అని విమర్శించారు. వివేకాను ఎవరు చంపారు? రాయలసీమకు ఏమీ చేయని వైసీపీ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలి? మా ప్రభుత్వం వచ్చాక 50 ఏళ్లకే BCలకు వృద్ధాప్య పింఛను ఇస్తాం అని తెలిపారు. BC, SC, STలను ఆర్థికంగా పైకి తీసుకొస్తా. ముస్లింలకు అన్యాయం జరగనివ్వను’ అని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే.. మన రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ స్కాం పెద్దదని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ‘వైసీపీ నేతలు దోచుకున్న డబ్బు కక్కిస్తా. నేనొస్తే కరెంట్ కోతలుండవు, ఛార్జీలు పెరగవు. చెత్త పన్ను రద్దు చేస్తా అని పేర్కొన్నారు. జగన్ మళ్లీ వస్తే జుట్టు, గాలి మీద కూడా పన్ను వేస్తాడు. యువతకు ఏటా 4లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత నాది అని పేర్కొన్నారు. సీపీఎస్ సమస్య పరిష్కారం కోసం కొత్త విధానం తీసుకొస్తా’ అని హామీలిచ్చారు.