రామచిలుక అరుస్తుందని యజమానిపై కేసు..!

-

సాధారణంగా రామ చిలుక అంటే ఎవరైనా ఇష్టపడతారు. వీలుంటే దానిని ఓసారి చేతిలోకి తీసుకుని ముద్దాడాలని అనుకుంటారు. కొందరు వాటిని ఇళ్లల్లో పెంచుకుంటూ ఎంతో గారాబంగా చూసుకుంటారు. చిలుక అరుపులు, చేష్టలకు మురిసిపోతుంటారు.

కానీ, ఓ వృద్ధుడికి అదే నచ్చలేదు. రామచిలుక అరుపులు.. ఆయనకు చికాకు తప్పించాయి. పక్కింట్లో ఉన్న రామచిలుక గోల తాను తట్టుకోలేక పోతున్నానంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.

పుణె నగరంలోని శివాజీ నగర్ ప్రాంతంలో సురేశ్​ శిందే అనే 72 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయన పక్కింట్లో ఉంటున్న అక్బర్​ అంజద్​ ఖాన్​.. ఓ రామచిలుకను పెంచుకుంటున్నాడు. అయితే చిలుక ఎప్పుడూ అరుస్తూనే ఉందని, అది తనకు చిరాకు తెప్పిస్తున్నట్లు సురేశ్​ శిందే.. ఖడ్కే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిబంధనల ప్రకారం దర్యాప్తు చేపడతామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news