రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని, కేసీఆర్ పై మరోసారి ఫైరయ్యారు వైెస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్శిళ. ఇదివరకు ధాన్యంకొనుగోలు, నిరుద్యోగ సమస్యలపై ఆమె ప్రభు్త్వం పై విమర్శలు గుప్పించారు. తాజాగా సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం దండుపల్లిలో ఆత్మహత్య చేసుకున్న స్వామి కుటుంబాన్ని పరామర్శించారు. రైతుల పాలిట కేసీఆర్ హంతకుడిగా తయారయ్యాడని విమర్శలు చేశారు వైఎస్ షర్మిళ. రోజుకో రైతు చనిపోతుంటే దొర కండ్లు తెరవడం లేదు. సీఎం సొంత ఇలాఖాలోనే రైతుల ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదని ఆమె విమర్శించారు. ధరణి వల్లే ఒకే కుటుంబంలో ఇద్దరు తండ్రీకొడుకులు మరణించారని .. వీరిద్దరి చావులకు కారణం కేసీఆరే అని ఆమె దుయ్యబట్టారు. ఏడాది గడిచిన తల్లికి పెన్షన్ రాలేదని ఆమె అన్నారు. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా.. ఈ పాపం పోదని.. సీఎంకు ఏమాత్రం ఇంగితం ఉన్నా బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని.. కనీసం ఉన్నోళ్లనయిన ఆదుకోవాలని డిమాండ్ చేశారు షర్మిళ.