తమిళనాడులో ఒక్కసారిగా పెరిగిన ఓమిక్రాన్ కేసులు…

-

దేశంలో ఓమిక్రాన్ విధ్వంసం కొనసాగుతోంది. కేసుల సంఖ్య 300కు చేరువ అవుతోంది. గత కొన్ని రోజులుగా రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోాదవుతున్నాయి. ఇదిలా ఉంటే ఓమిక్రాన్ భయాలతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాలు క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను నిషేధించాయి. ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడులో భారీస్థాయిలో ఓమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

తమిళనాడులో ప్రస్తుతం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 34కు చేరింది. నిన్నటి వరకు ఆ రాష్ట్రంలో కేవలం ఒకే కేసుల ఉండేది. తాజాగా కొత్త కేసులు రావడంతో ఒకే సారి పెద్ద ఎత్తున ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి వరకు ఓమిక్రాన్ కేసుల జాబితాలో చివరి స్థానంలో ఉన్న తమిళనాడు.. ప్రస్తుతం నాలుగో స్థానంలోకి ఎగబాకింది. ప్రస్తుతం తమిళనాడుతో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో  అక్కడ కూడా క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news