ఓమిక్రాన్ వేరియంట్ పై వ్యాక్సిన్ల ప్రభావం తక్కువే.. సంచలన విషయం తెలిపిన మోడెర్నా.. దానికి కారణం ఇదే..

-

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ గుబులు పుట్టిస్తోంది. మరోసారి ప్రపంచ దేశాలు తమ బోర్లర్లను మూసేసే పరిస్థితి ఏర్పడింది. మళ్లీ దేశాల మధ్య రాకపోకలకు ఆంక్షలు పడుతున్నాయి. ఓమిక్రాన్ అధికంగా ఉన్న దేశాలపై మిగతా ప్రపంచ దేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ  WHO కూడా ఓమిక్రాన్ పై అప్రమత్తత ప్రకటించింది. మరోసారి ఓమిక్రాన్ రూపంలో కరోనా వ్యాప్తి ఎక్కువ అయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చిరిస్తోంది. ప్రపంచ దేశాలు అలెర్ట్ గా ఉండాలని హెచ్చిరిస్తోంది.

అయితే ప్రస్తుత వ్యాక్సిన్లు ఓమిక్రాన్ పై ఎంతమేర పనిచేస్తాయో అనేది స్పష్టత లేదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ఓమిక్రాన్ వేరియంట్ పై పెద్దగా ప్రభావం చూపించలేవని ప్రముఖ ఫార్మా సంస్థ మోడెర్నా తెలిపింది. వ్యాధికారక స్పైక్ ప్రోటీన్ పై అధిక సంఖ్యలో మ్యుటేషన్లు ఉండటమే కారణం అని చెబుతోంది. దీంతో వైరస్ వ్యాక్సిన్లకు లొంగకుండా తయారవుతుందని తెలిపింది. ఇప్పుడున్న వ్యాక్సిన్లను మ్యుటేషన్లకు అనుగుణంగా తయారు చేాయాల్సిన అవసరం ఉందని తెలిపింది. అత్యంత తీవ్ర రూపంలో కరోనా వ్యాధికి కారణమైన డెల్టా వేరియంట్ కన్నా .. ఓమిక్రాన్ వేరియంట్ లో మ్యుటేషన్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇది వేగంగా ఇతరులకు వ్యాపిస్తుందని పరిశోధనల్లో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news