సీఎం జగన్ కు నారా లోకేష్ బహిరంగ లేఖ

-

ఏపీ సీఎం జగన్ కు టిడిపి యువ నేతశ నారా లోకేష్ లేఖ రాశారు. గ్రామ పంచాయతీల నుంచి మ‌ళ్లించిన నిధులు రూ. 1309 కోట్లు త‌క్ష‌ణ‌మే పంచాయ‌తీ ఖాతాల‌లో జ‌మ‌ చేయాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. జగన్ సీఎం అయినప్పటు నుంచి అప్పులు తేవడం, ఆస్తులు అమ్మేయడం, కనిపించిన చోటునల్లా తాకట్టు పెట్టడం ఈ మూడు మార్గాల ద్వారానే పాలన సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు లోకేష్. గ్రామ‌ పంచాయ‌తీల‌కు కేంద్ర ప్రభుత్వం 14, 15 వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధుల‌ని దారి దోపిడీ దారుల్లా త‌ర‌లించుకుపోవ‌డం దారుణమని ఫైర్ అయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయాయని.. కేంద్ర ప్ర‌భుత్వం పంచాయ‌తీల‌కు నేరుగా ఇచ్చిన రూ.1309 కోట్లను పంచాయ‌తీ ఖాతాల నుంచి మళ్లించడం రాజ్యాంగ‌ విరుద్ధమని అగ్రహించారు. స‌ర్పంచ్‌, వార్డుస‌భ్యుల‌కు తెలియ‌కుండా, పంచాయ‌తీ బోర్డు తీర్మానం లేకుండా నిధులను మళ్లించడం మోసమేనని.. పంచాయ‌తీ ఖాతాల నుంచి నిధులు మళ్లించి స్థానిక‌ ప్రజా ప్ర‌తినిధుల‌ని మోసం చేశారని విమర్శించారు. రాజ‌కీయాధి ప‌త్యం కోసం ప్ర‌క‌టించిన ఏక‌గ్రీవాల పారితోషికం పంచాయ‌తీల‌కు విడుద‌ల చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news