BREAKING : మరోసారి అమ్నీషియా పబ్‌పై కేసు..

-

రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమ్నీషియా పబ్‌పై మరోసారి కేసు నమోదు చేశారు పోలీసులు. హైకోర్టు నిబంధనలను ఉల్లఘించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ధిక్కరణ కింద కేసు నమోద చేశారు పోలీసులు. రాత్రి పరిమితి సమయం దాటినా సౌండ్స్‌ ప్లే చేసింనందుకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇదిలా ఉంటే.. గతంలో మైనర్‌ బాలిక గ్యాంగ్‌ కేసులో ప్రధాన నిందితుడికి ఇటీవల బెయిల్‌ వచ్చింది. సాదుద్ధీన్ మాలిక్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. గ్యాంగ్ రేప్ కేసులో సాదుద్ధీన్ మాలిక్‌ కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు జువెనైల్స్‌కు బెయిల్‌ వచ్చింది. అయితే.. ఈ కేసులో మొత్తం నిందితులు ఆరుగురు కాగా… వారిలో ఐదుగురు మైన‌ర్లు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఐదుగురు మైన‌ర్ల‌లో బ‌హ‌దూర్‌పురా ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నారు. అయితే న‌లుగురు మైన‌ర్ల‌ను మేజ‌ర్లుగా గుర్తించిన బోర్డు… ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం మైన‌ర్‌గానే పేర్కొంది.

In The Wonderland Of Kuala Lumpur Flesh Market – Asia Travel Blog

రేప్‌కు పాల్ప‌డ్డ వారు మైన‌ర్లు ఎలా అవుతారు?.. మైన‌ర్లు అయితే అత్యాచారం చేసినా శిక్షించ‌లేమా?.. అంటూ హైద‌రాబాద్ పోలీసులు ఇటీవ‌లే జువెనైల్ జ‌స్టిస్ బోర్డులో ఓ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డ వీరిని మేజ‌ర్లుగా గుర్తించాల‌ని బోర్డును కోరారు. అత్యాచారం స‌మ‌యంలో బాధితురాలి ప‌ట్ల మైన‌ర్లు వ్య‌వ‌హ‌రించిన తీరును బోర్డుకు వివరించారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను ముగించిన జువెనైల్ జ‌స్టిస్ బోర్డు శుక్ర‌వారం కీల‌క తీర్పు చెప్పింది. రేప్‌కు పాల్ప‌డ్డ న‌లుగురు మైన‌ర్ల‌ను మేజ‌ర్లుగా గుర్తించి కోర్టులో విచార‌ణ‌ను మొద‌లుపెట్టాల‌ని పోలీసుల‌ను బోర్డు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news