వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్‌లో టీమిండియా ఓట‌మికి ఆ ఒక్క త‌ప్పుడు నిర్ణ‌య‌మే కార‌ణ‌మా..?

-

జ‌ట్టు ఓట‌మికి అనేక కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ కెప్టెన్ కోహ్లి, టీం మేనేజ్‌మెంట్ తీసుకున్న ఆ ఒక్క అనాలోచిత నిర్ణ‌యమే టీమిండియా ఓట‌మికి కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈ సారి ఎలాగైనా స‌రే.. భార‌త్ వ‌ర‌ల్డ్ క‌ప్ ను ఇంటికి తెస్తుంద‌నుకున్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల ఆశ‌లు ఆవిర‌య్యాయి. వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భార‌త ఆట‌గాళ్లు ఇప్పుడు ఇంటా.. బ‌య‌టా.. అందరిచే విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. జ‌ట్టు ఓట‌మికి అనేక కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ కెప్టెన్ కోహ్లి, టీం మేనేజ్‌మెంట్ తీసుకున్న ఆ ఒక్క అనాలోచిత నిర్ణ‌యమే టీమిండియా ఓట‌మికి కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో కేదార్ జాద‌వ్‌కు బ‌దులుగా దినేష్ కార్తీక్‌ను జ‌ట్టులోకి తీసుకుని కెప్టెన్ కోహ్లి, టీం మేనేజ్‌మెంట్ భారీ త‌ప్పిద‌మే చేసింద‌ని మాజీలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వారు తీసుకున్న ఆ త‌ప్పుడు నిర్ణ‌య‌మే భార‌త్‌ను భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింద‌ని వారంటున్నారు.

 టీంలో నిల‌క‌డా రాణిస్తున్న కేదార్ జాద‌వ్‌ను కాద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రల్డ్ క‌ప్‌లో అన్ని మ్యాచ్‌ల‌ను ఆడ‌ని దినేష్ కార్తీక్‌ను తుది జ‌ట్టులోకి ఎంపిక చేసి పొర‌పాటు చేశార‌ని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

టీమిండియా న్యూజిలాండ్ చేతిలో ఓడింది కేవ‌లం 18 ప‌రుగుల తేడాతో. అదే దినేష్ కార్తీక్‌కు బ‌దులుగా కేదార్ జాద‌వ్ ఉండి ఉంటే ఆ ప‌రుగుల‌ను అత‌ను చేసేవాడ‌ని.. దాంతో టీమిండియా అల‌వోక‌గా ఈ మ్యాచ్‌లో గెలిచి ఉండేద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఏ మ్యాచ్‌లోనూ ఒకే జ‌ట్టును ఆడించ‌ని టీమిండియా కెప్టెన్ కోహ్లి ఈ మ్యాచ్‌లో కూడా అదే పొర‌పాటు చేశాడ‌ని, జ‌ట్టు కూర్పు స‌రిగ్గా లేద‌ని మాజీలు చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు ఆ ఓట‌మిని, మ్యాచ్‌లో జ‌రిగిన త‌ప్పుల‌ను త‌ల‌చుకుని మ‌నం చేసేదేమీ ఉండ‌దు క‌దా.. మ‌ళ్లీ 4 ఏళ్ల వ‌ర‌కు టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేచి చూడాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news