వారసుడొచ్చాడు.. సీఎం జగన్ రాజకీయ వారసుడు ఆయనేనా?

-

బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించి.. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న రాజారెడ్డియే వైఎస్ జగన్ అసలు సిసలు నాయకుడు.. వాళ్ల తాత లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు.. అంటూ సోషల్ మీడియాలో వార్తలే వార్తలు.

ప్రస్తుతం ఏపీలో చర్చించుకునే వ్యక్తుల్లో ఏపీ సీఎం జగన్ మొదటి ప్లేస్ లో ఉంటారు. ఆయన ఏపీకి ముఖ్యమంత్రి కావడం.. ఇతర సీఎంల్లా కాకుండా.. ఆయన రూటే సపరేట్ అంటూ కొత్త పంథాలకు తెర లేపడంతో జగన్ హాట్ టాపిక్ అయ్యారు.

ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.. కాకపోతే ఈసారి జగన్ హాట్ టాపిక్ అయింది దేనికో తెలుసా? తన రాజకీయ వారసుడి వల్ల. జగన్ కు ఇద్దరు కూతుళ్లే కదా. కొడుకులు లేరు కదా. మరి.. ఆయన రాజకీయ వారసుడు ఎవరో తెలుసుకోవడం కొంచెం ఇంట్రెస్టింగే కదా.

జగన్ రాజకీయ వారసుడు.. ఆయన చెల్లి షర్మిల కొడుకు రాజారెడ్డి.. అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మేనల్లుడు. అయితే.. రాజారెడ్డి ఇటీవల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాల్లో కనిపించాడు. హల్ చల్ చేశాడు. దీంతో అందరి దృష్టి మనోడిపై మళ్లింది.

అంతే కాదు.. సీఎం జగన్ కూడా మేనల్లుడితో సరదాగా ముచ్చటించాడు. అమ్మమ్మ విజయమ్మ వెంటనే ఎప్పుడూ ఉంటాడట రాజారెడ్డి.

రాజారెడ్డికి కూడా రాజకీయాలంటే ఇష్టమట. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా తల్లితో కలిసి అడుగేశాడు. పాదయాత్ర చేశాడు. పలు రాజకీయ వేదికల్లోనూ మెరిశాడు.

బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించి.. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న రాజారెడ్డియే వైఎస్ జగన్ అసలు సిసలు నాయకుడు.. వాళ్ల తాత లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు.. అంటూ సోషల్ మీడియాలో వార్తలే వార్తలు.

అన్నీ మనం అనుకుంటే కాదు కదా. నిజంగానే రాజారెడ్డి… జగన్ రాజకీయ వారసుడు అవుతాడా? లేదా? అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news