అదిరే స్కీమ్.. ప్రతి నెల రూ. లక్ష పెన్షన్..!

-

చాలా మంది భవిష్యత్తు లో ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. మీరు కూడా మీకు నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెట్టాలని అనుకుంటున్నారా…? అయితే బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న స్కీమ్ ని చూడాల్సిందే. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందించే స్కీమ్స్ లో న్యూ జీవన్ శాంతి యోజన కూడా ఒకటి.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెడితే పదవీ విరమణ తర్వాత జీవితాంతం పెన్షన్ పొందొచ్చు. ఇక న్యూ జీవన్ శాంతి యోజన వివరాలని చూద్దాం.
ఎల్ఐసీ కొత్త జీవన్ శాంతి పథకం ఒక యాన్యుటీ ప్లాన్. ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ఈ పథకం కింద రెండు రకాల ఆప్షన్ల సదుపాయాన్ని ఇస్తున్నారు.

మొదటి ఆప్షన్ సింగిల్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ. ఇంకొకటి ఉమ్మడి జీవితానికి వాయిదా వేసిన యాన్యుటీ. పాలసీదారుడు చనిపోయినట్లతే సింగిల్ లైఫ్ ప్లాన్ కోసం వాయిదా వేసిన యాన్యుటీ ఉంటే ఖాతాలో జమ చేసిన డబ్బు నామినీకి వస్తాయి. జాయింట్ లైఫ్ కోసం వాయిదా వేసిన యాన్యుటీలో కనుక ఎవరైనా మరణిస్తే మరొకరికి పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.

ఇద్దరు వ్యక్తులు చనిపోతే మొత్తం డబ్బు నామినీకి ఇవ్వబడుతుంది. ఎల్‌ఐసి 5 జనవరి 2023 నుండి యాన్యుటీ రేట్లను పెంచింది. ఈ జీవన్ శాంతి పథకం కనీస ప్లాన్ ధర రూ.1.5 లక్షలు. దీనిలో మీరు 1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. అవసరాన్ని బట్టి సంవత్సరానికి, 6 నెలలు, 3 నెలలు లేదా నెలవారీ ప్రాతిపదికన పెన్షన్ ని తీసుకోచ్చు. ఇందులో లక్షన్నర పెడితే జీవితాంతం ప్రతి నెలా రూ.1000 పెన్షన్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news