‘RRR’‌కు మరో అవార్డు..!

-

‘ఆర్ఆర్ఆర్’ సినిమా మరో అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను మూటగట్టుకున్న ఈ చిత్రం తాజాగా 46వ జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్క సంబంధించి ‘అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్’ విభాగంలో అవార్డు లభించింది. కాగా అంతర్జాతీయ సినిమా అయిన అవతార్ 2ను కాదని ‘ఆర్ఆర్ఆర్’ అవార్డును సాధించడం విశేషంగా సినీ ఎక్స్పర్ట్స్ అభివర్ణిస్తున్నారు. తాజాగా 46వ జపాన్ అకాడెమీ ఫిల్మ్ ప్రైజ్‌కు సంబంధించి “ఔట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్” విభాగంలో అవార్డును దక్కించుకుంది.

“అవతార్”, “టాప్‌గన్ : మ్యావరిక్” వంటి ప్రతిష్టాత్మక హాలీవుడ్ చిత్రాలను వెనక్కినెట్టి “ఆర్ఆర్ఆర్” ఈ జపాన్ పురస్కారాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. దీంతో చిత్రబృందంతో పాటు అభిమానులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే, ఈ చిత్రం ఇప్పటికే ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెల్సిందే. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటు నాటు పాట నామినేషన్స్‌కు షార్ట్ లిట్ అయింది. అలాగే, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లోనూ ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతుంది. మరికొన్ని గంటల్లో ఈ నామినేషన్స్ తుది జాబితా వెల్లడికానుంది.

Read more RELATED
Recommended to you

Latest news