తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కారణంగా చాలామంది నేతలు ఇబ్బంది పడుతున్నారని కొంతమంది మీడియాలో కథనాలు రాస్తూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది పక్కన పెడితే కొంత మంది నేతలు మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకునే అవకాశాలు ఈ మధ్యకాలంలో కనబడుతున్నాయి. ప్రధానంగా కొండా సురేఖ వంటి వారు రేవంత్ రెడ్డి విషయంలో కాస్త అనుకూలంగా ఉన్నారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్క రేవంత్ రెడ్డి తో ముందు నుంచి కూడా సన్నిహితంగానే ఉంటున్నారు. ఇక ఆయనను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేయాలని ఆమె ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు. వాస్తవానికి రేవంత్ రెడ్డిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేస్తే కొంత మంది కీలక నేతలు బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి.
దీని కారణంగా పార్టీ నష్టపోతోంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీతక్క లేకపోతే కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు గా ఎంపిక చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలతో చర్చలు జరుపుతోంది. బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు కాబట్టి వారిని ఎంపిక చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది.