కేంద్రం కొత్త మార్గదర్శకాలు: మొదటి టీకాకి రెండవ టీకాకి 6-8 వారాల వ్యవధి

-

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ (కోవిషీల్డ్) అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. ఇప్పటికే చాలా మంది కరోనా బాధితులు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్రఆరోగ్య మంత్రిత్వ శాఖ బాధితులకు వ్యాక్సిన్ వేయడంపై కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్ మొదటి టీకా వేసిన తర్వాత రెండవ టీకాకు 6 నుంచి 8 వారాల వ్యవధిలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలో 4 నుంచి 6 నెలల వ్యవధిలో టీకా అందించేవారు.

కోవిషీల్డ్

నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు (ఎన్‌టీఎజీఐ), నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూపు కోవిషీల్డ్ టీకా వేయించడంపై నివేదిక సమర్పించారు. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వీరి సలహాలను పరిగణలో తీసుకుని రెండవ సారి టీకా ఇచ్చే సమయాన్ని పెంచింది. అయితే ఇది కేవలం కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు మాత్రమే వర్తిస్తుందని, కోవాగ్జిన్‌కు వర్తించదన్నారు. ఎన్‌టీఎజీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కోవిషీల్డ్ మొదటి టీకా వేసిన తర్వాత రెండవ టీకాను 6 నుంచి 8 వారాల మధ్య వేయాలని సూచించారు. ఇలా చేస్తే బాధితులు కరోనా నుంచి తొందరగా క్యూర్ అవడంతోపాటు ఆరోగ్యంగా ఉంటారని వెల్లడించారు. అయితే ఈ మేరకు కేంద్ర కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి, రెండవ మోతాదు టీకా వేయడంపై పలు సూచనలు అందజేశారు. దీని ప్రకారం టీకాను అందించాలని తెలిపారు. అయితే ప్రస్తుతం దేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, ఆస్ట్రోజెనికా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4.5 కోట్లకుపైగా కరోనా బాధితులకు వ్యాక్సిన్ వేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 4,50,65,998కిపైగా కరోనా బాధితులకు టీకా అందించారు. 77,86,205 ఆరోగ్య సంరక్షకులకు, 80,95,711 ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మొదటి విడతలో టీకా అందజేశారు. 45 ఏళ్లు పైబడిన వారు 37,21,455, 60 ఏళ్లు పైబడిన వారు 1,79,70,931 మంది ఉన్నారు. జనవరి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా టీకాను ప్రారంభించగా.. ఫిబ్రవరి 2వ తేదీన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news