విషాదం : అవతార్‌ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

-

అవతార్ 2 సినిమా చూస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఓ వ్యక్తి మరణించాడు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని లక్ష్మీరెడ్డి శ్రీనుగా గుర్తించారు. ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన అవతార్‌-2 శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్‌ తెచ్చుకుంది. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహించిన ఈ విజువల్‌ వండర్‌ను చూడడానికి ప్రేక్షకులు థియేటర్‌లకు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా చూస్తూ ఆంధ్ర ప్రదేశ్‌లో ఓ వ్యక్తి మరణించాడు. కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి అవతార్‌-2 సినిమాకు వెళ్ళాడు. సినిమా మధ్యలో శ్రీనుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కూలిపోయాడు.

Avatar: The Way Of Water Movie Review: James Cameron Thinks With 10 Brains  & A Heart Straight Out Of A Bollywood Family Drama

శ్రీను తమ్ముడు రాజు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఇలాగే అవతార్‌-1కు కూడా జరిగింది. తైవాన్‌లో 42 ఏళ్ళున్న ఒక వ్యక్తి ‘అవతార్’ సినిమా చూస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. డాక్టర్‌లు ఆ వ్యక్తికి అధిక రక్తపోటు ఉన్నట్లు తెలిపారు. సినిమా చూస్తున్నప్పుడు ఓవర్‌ ఎగ్జైట్‌ అయ్యాడని, దానీ వల్ల ఆ వ్యక్తికి అధిక రక్తపోటు వచ్చిందని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news