ఆసక్తిరేపుతున్న నిఖిల్ ’18 పేజెస్’ ట్రైలర్‌

-

నిఖిల్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 18 పేజీస్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన ప్రేమ కథాకథనాలతో ఈ సినిమా నడవనుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ అంచనాలు పెంచుతూ వెళ్లాయి.

18 Pages Theatrical Trailer | Nikhil, Anupama | Sukumar | Surya Pratap |  Gopi Sundar | Bunny Vas - YouTube

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. లవ్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ కథ నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ‘ప్రేమించడానికి మనకి ఒక రీజన్ ఉండకూడదు .. ఎందుకు ప్రేమించావంటే ఆన్సర్ ఉండకూడదు’ అంటూ అనుపమ పరమేశ్వరన్ చెప్పిన డైలాగ్ హైలైట్. సుకుమార్ ఈ సినిమాకి కథను అందించగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. అజయ్ .. బ్రహ్మాజీ ముఖ్యమైన పాత్రలను పోషించారు. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ‘కార్తికేయ 2’ తరువాత నిఖిల్ – అనుపమ కలిసి నటించిన ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news