గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు మరో నీతా? : హరీశ్ రావు ఫైర్!

-

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకపడ్డారు. పంటలకు కల్పించే కనీస మద్దతు ధర(MSP) విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ‘వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, వన్ నేషన్ వన్ మార్కెట్’ అంటూ ఊదరగొట్టే కేంద్రం ‘వన్ నేషన్.. వన్ ఎమ్ఎస్పీ’ ఎందుకు ఇవ్వడం లేదని గురువారం ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు.

గుజరాత్‌లో పండుతున్న పత్తికి మద్దతు ధర క్వింటాకు రూ.8,257 చెల్లిస్తే.. తెలంగాణలో పండుతున్న పత్తికి మాత్రం రూ.7,521 మాత్రమే చెల్లించడం దుర్మార్గం అని ఫైర్ అయ్యారు. గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు మరో నీతా? అని ప్రశ్నించారు. పత్తికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకు ఉందని నిలదీశారు.‘వై నాట్ వన్ నేషన్.. వన్ ఎంఎస్పీ’ అని కేంద్రంలోని మోడీ సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version