చైనాలో లాంచ్‌ అయిన Oneplus Nord N20 SE స్మార్ట్‌ ఫోన్‌..!

-

వన్‌ ప్లస్‌ తన కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ ప్లస్‌ నార్డ్‌ ఎన్20 ఎస్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ చైనాలో విడుదల చేసింది. ఇది ఒక బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్.. ఫోన్‌కు సంబంధించి స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి…
వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ ధర..
ఈ స్మార్ట్ ఫోన్ ధరను 199 డాలర్లుగా (సుమారు రూ.15,800) నిర్ణయించారు.
బ్లూ ఒయాసిస్, సెలస్టియల్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ చైనా ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మనదేశంలో కూడా ఈ ఫోన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ పని చేయనుంది.
ఇందులో 6.56 అంగుళాల డిస్‌ప్లేను అందించారు.
2డీ స్లిమ్ బాడీతో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
33W సూపర్‌వూక్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఈ ఫోన్ 50 శాతం చార్జ్ అవ్వడానికి కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పట్టనుందని కంపెనీ తెలిపింది.
గతంలో లాంచ్ అయిన ఒప్పో ఏ57 4జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయినట్లు తెలుస్తోంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు కూడా కెమెరాను అందించారు.
ఈమధ్యనే లాంచన్‌ అయిన వన్‌ప్లస్ 10టీ ధర రూ.46,999 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి అమెజాన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. క్వాల్‌కాం లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news