టెన్త్‌ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త : ఈ ఏడాది కూడా 6 పేపర్లే !

-

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా అన్ని పాఠశాలలు మూత పడ్డ సంగతి తెలిసిందే. కరోనా కారణంగా విద్యార్థులకు పూర్తి స్థాయిలో సెలబస్‌ను పూర్తి చేయలేదు పాఠశాలలు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల్లో 6 పేపర్లకు మాత్రమే పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

అంటే…. పదవ తరగతి పరీక్షల్లో 11 పేపర్స్ కు బదులు 6 పేపర్స్ లకు మాత్రమే పరీక్షలు నిర్వహించనుంది సర్కార్‌. ఈ మేరకు 10 వ తరగతిలో పరీక్ష పేపర్లు, పరీక్ష విధానం, పరీక్ష సమయంపై క్లారిటీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వులనే ఈ ఏడాది కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫైనల్ పరీక్ష 80 మార్క్ లకు గానూ.. 20 మార్కులు ఇంటర్నల్ యాడ్‌ చేయనుంది సర్కార్‌. అలాగే… పరీక్ష సమయం 2 గంటల 45 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాలకు(అరగంట పెంపు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పరీక్ష పేపర్ లో విద్యార్థుల కు ఎక్కువ ఛాయిస్ ఉండే విధంగా ప్రశ్నల సంఖ్యలను పెంచనుంది.

Read more RELATED
Recommended to you

Latest news