ఆపరేషన్ మునుగోడు.. ఓటు రేటు ఎక్కువే..!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు జరగనున్న మునుగోడు ఉపఎన్నికని ఖచ్చితంగా గెలుచుకుని తీరాలని చెప్పి అన్నీ పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. మునుగోడులో మూడు పార్టీలు బలంగా కనబడుతున్నాయి. ఎవరికి విజయం దక్కుతుందో అంచనా వేయలేని పరిస్తితి. అందుకే ఎవరికి వారు మునుగోడుని సొంతం చేసుకోవడానికి తమదైన శైలిలో వ్యూహాలు పన్నుతున్నారు.

ఇక మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ రావడంతో..పార్టీలు అప్పుడే ఓటర్లని ఆకర్షించే విధంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే మూడు పార్టీల నేతలు మునుగోడులో మకాం వేశారు. దసరా పండుగ, బీఆర్ఎస్ ప్రకటన అవ్వగానే టీఆర్ఎస్ నేతలు మునుగోడు బరిలో దిగనున్నారు. నియోజకవర్గంలోని ఒక్కో ఎంపీటీసీ పరిధిని ఒక్కో యూనిట్‌గా విభజించి.. ఆ యూనిట్ల బాధ్యతలను ఒక్కో నేతకు అప్పగించారు.

మొత్తం 86 ఉన్నట్టు టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఒక యూనిట్‌కు సీఎం కేసీఆర్‌, మరొకదానికి కేటీఆర్‌, ఇంకొక దానికి హరీశ్‌..అలాగే 12 మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగుతున్నారు. అటు బీజేపీ తరుపున అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..ఇప్పటికే గ్రామం గ్రామం తిరేగేస్తున్నారు. ఈయనకు మద్ధతుగా రాష్ట్ర బీజేపీ నేతలు మునుగోడులో మకాం వేశారు. ఇక తాజాగా బండి సంజయ్..మునుగోడులో ఉన్న బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటరును ఒకటికి నాలుగుసార్లు కలవాలని సూచించారు. ఇక ఓటుకు రూ.30 వేలిచ్చి గెలవాలని కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

అటు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నియోజకవర్గాన్ని చుట్టుముట్టేస్తున్నారు. ఈమెకు మద్ధతుగా కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగేశారు. మొత్తానికి మూడు పార్టీలు మునుగోడుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక ఇక్కడ గెలవడానికి అన్నీ రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు పార్టీల అభ్యర్ధులు కూడా ఓటుకు భారీగానే ఖర్చు పెట్టేందుకు రెడీ అయ్యారని చర్చ నడుస్తోంది. తెలంగాణలో మరో కాస్ట్‌లీ ఎన్నికగా మునుగోడు నిలవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news