ఆప‌రేష‌న్ ‘ పోలో ‘ క్లైమాక్స్‌ : భారత్‌లో హైదరాబాద్‌ విలీనం

-

ఆపరేషన్ పోలో తెలుగు ప్రజలకు ఈ పదం ఎప్పుడు చరిత్రలో గుర్తుండిపోతుంది. భారతదేశ చరిత్రలో ఆపరేషన్ పోలో అనేది చిరకాలం ఉండి పోతుంది. చరిత్రలోనే ఈ పదానికి ఎంతో క్రేజ్ ఉంది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నిజం సంస్థానానికి స్వాతంత్య్రం రాలేదు. హైదరాబాద్ నిజాం దాయాది దేశమైన పాకిస్తాన్ తో చేతులు కలిపి భారతదేశ రహస్యాలు పాకిస్తాన్ అందజేస్తూ భారత ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేసే నియంతలా మారిపోయాడు. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినా భారత ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నా… తమ జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నా నిజాం సంస్థానంలో ఉన్న ప్రజలు చూడ‌ని నరకం లేదు.

జాం పాలకుల నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు నానా కష్టాలు పడ్డారు.స్వాతంత్రం వచ్చాక దాదాపు 13 నెలలపాటూ,తెలంగాణ ప్రజలు చూడని నరకం లేదు.ఒంటిమీద గుడ్డలు లేవు,కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశారు. చివరకు ప్రజలు తిరుగుబాటు మొదలైంది. అందరూ ఏకమై నిజాంపై ఎదురుతిరిగారు. ఎంతోమంది ఉద్యమనేతలు, కళాకారులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులు, స్త్రీలు పిల్లలు అనే తేడా లేకుండా తుపాకులు బట్టి తరిమికొట్టారు. రోజురోజుకు ఉద్యమం తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఎలెర్ట్‌ అయింది.

నిజాం సంస్థానాన్ని భారతదేశంలో కలపాలని నిజాంను కోరింది. అయితే నిజాం మాత్రం భారత ప్రభుత్వ సూచనను తిరస్కరించి పాకిస్తాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి… రహస్య చర్చలు ప్రారంభించారు. వెంటనే భారత ప్రభుత్వంలో నిజాం సంస్థానాన్ని క‌లిపేయాల‌ని అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సూచించింది. ఇందుకోసం కేంద్రం హోం మంత్రి స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ నేతృత్వంలో ఆప‌రేష‌న్ పోలో పేరుతో నిజాం సంస్థానంపై సైనిక చ‌ర్య ప్రారంభించింది.

ఢిల్లీ నుంచి రైళ్ల‌లో ప‌లువురు భార‌త సైనికులు గ‌ప్‌చుప్‌గా మ‌రుస‌టి రోజు ఉద‌యానికే హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. భారత సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది. నిజాం ఆలీఖాన్ ఉన్న కోట‌ను ముట్ట‌డించింది. కొంత‌సేపు త‌న సైన్యంతో భార‌త సైన్యాన్ని ప్ర‌తిఘ‌టించిన నిజాం ఆ త‌ర్వాత చేతులు ఎత్తేశాడు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు.ఇక లొంగిపోక తప్పదని అర్థమైంది.1948 సెప్టెంబర్ 17న ఈ శుభవార్తని హైదరాబాద్ రేడియో ద్వారా, నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైందని ప్రకటించారు.

1947 ఆగస్ట్ 15న మన దేశానికి మాత్రమే స్వాతంత్రం వచ్చింది. కానీ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మాత్రం అసలైన స్వాతంత్రం 1948 సెప్టెంబర్ 17 లభించనట్లే.. అందుకే ఇదే రోజును తెలంగాణ ప్రజలు తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అప్ప‌టి నుంచి భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఆప‌రేష‌న్ పోలో పేరు మార్మోగితే… తెలంగాణ చ‌రిత్ర‌లో విమోచ‌న దినం పేరు చ‌ర్చ‌కు వ‌స్తూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news