వైయస్సార్ కళ్యాణమస్తు, షాది తోఫా పథకాలకు అందిన దరఖాస్తులకు జగన్ ప్రభుత్వం త్వరలో నగదు బదిలీ చేయనుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య పెళ్లి చేసుకున్న ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన వారు ఈనెల 31 లోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వధువుకి 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు నిండటంతో పాటు టెన్త్ పాస్ అయి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్ నెలల్లో దరఖాస్తు చేసుకున్న వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయనుండగా.. ఈ పథకం కింద కులాంతర వివాహం చేసుకుంటే కౌ1.20లక్షలు, దివ్యాంగులకు 31.5లక్షలు, మైనార్టీలకు కౌలక్ష, బీసీలకు 50 వేలు అందించనున్నారు. వధూవరులిద్దరూ తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి.