మహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక మలుపు తిరిగింది. శివసేన పార్టీ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోవడంతో.. మహా వికాస్ అగాడి కూటమి ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని బీజేపీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారిని కలిసి ఫోర్ టెస్ట్ నిర్వహించాలని కోరింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్‌ను కలిసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని నివేదించారు.
ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ బలనిరూపణకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. గురువారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రంలోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి సాయంత్రం ఐదు గంటల వరకే డెడ్ లైన్ విధించింది. దీంతోపాటు బలపరీక్షను రికార్డ్ చేయాలని పేర్కొన్నారు. బలనిరూపణ నేపథ్యంలో రేపు సాయంత్రం షిండే వర్గం గుహవతి నుంచి ముంబైకి చేరుకోనున్నట్లు సమాచారం. బలనిరూపణ తర్వాతే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని షిండే తెలిపారు.