RRR చిత్రం కు ఆస్కార్ అవార్డు.. వచ్చే అవకాశం ఉందా..?

-

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ చిత్రం RRR ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఇక ఈ సినిమా స్టోరీ స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన పాత్రలు పోషించిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కలయికలో సాగే ఇటువంటి ఒక పీరియాడికల్ స్టోరీ గా చిత్రీకరించారు. ఈ చిత్రం మార్చి లో విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు మించి వసూళ్ళు రాబట్టింది.RRR' to release on OTT, details inside

మరొకసారి తెలుగు సినిమా సత్తా ప్రపంచ దేశానికి చాటిచెప్పారు. ఇక ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు దేశవ్యాప్తంగా. మే 20వ తేదీన ZEE-5 లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యింది. అయితే హిందీ వెర్షన్ లో మాత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యింది.. ఇదిలా ఉంటే హిందీ వెర్షన్ ఇంగ్లీష్ మూవీలో తరువాత నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా ప్రేక్షకులు వీక్షించిన సినిమాగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా చూసిన అమెరికన్ హాలీవుడ్ యాక్టర్స్, రైటర్స్ కూడా రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఉన్నారు.RRR,' With Ram Charan, NTR Jr, Roars to $65 Million Opening Weekend - Variety

ఈ నేపథ్యంలోనే ఈ మూవీతో పలు ఆసక్తికరమైన చర్చ మొదలైంది.. అదేమిటంటే వరల్డ్ వైడ్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది RRR చిత్ర ఆస్కార్ కు నామినేషన్ సాధిస్తుందా అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఎక్కువగా ఆస్కార్ కు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేట్ అయ్యే వాటిలో ఆర్ట్ మూవీస్, కళాత్మక చిత్రాలు మాత్రమే ఎంపిక ఆవ్వడం జరుగుతుంది. కమర్షియల్ చిత్రాలకు పెద్దగా స్కోప్ ఉండదని చెప్పవచ్చు కానీ ఇటీవల అమెరికన్లు హాలీవుడ్ నటులు ఈ సినిమా ను చూసి ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా.. ఈ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యే అవకాశం ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరి వస్తుందో రాదో తెలియాలి అంటే కొద్ది రోజులు ఉండాల్సింది.

Read more RELATED
Recommended to you

Latest news