మునగ పంటలో ఎరువుల యాజమాన్యం..!!

-

మునగ పోషకాలకు పుట్టినిల్లు అందుకే వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. మార్కెట్లో మునగకు నిత్యం డిమాండ్ ఉంటుంది.అనేక మంది రైతులు తమ పంటపొలాల్లో మునగను సాగు చేస్తున్నారు. మునగ సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాణ్యమైన దిగుబడులను తీసేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మునగ పంటకు అందించే ఎరువుల విషయంలో రైతులు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది..ఇక మునగ పంటకు ఎరువుల యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


రసాయనిక ఎరువులు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వాటి వాడకం రైతులకు భారంగా మారింది. ఈ తరుణంలో నిపుణులు సూచించిన మేరకు సింగిల్ సూపర్ ఫాస్పేట్ తగిన మోతాదులో వాడితే ఖర్చు తగ్గటంతోపాటు మొక్కలకు మంచి పోషకాలు అందించినట్లవుతుంది..మునగ నాటిన ఒకటిన్నర నెల తర్వాత గుంతకు 45 గ్రాముల నత్రజని, 15 గ్రాముల భాస్వరం, -30 గ్రాముల పొటాష్‌ ఎరువులను వేసుకోవాలి.

గింజలు విత్తిన 3 నెలలకు ఒక్కొక్క గుంటకు 100గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసి నీరు పారించాలి. మొక్కలకు ఆరు నెలలకోసారి, 9నెలలకు మళ్లీ ఒకసారి 100గ్రాముల యూరి యా, 50గ్రాముల మ్యూరేట్‌ఆఫ్‌ పొటాష్‌ను వేసి నీరు పెట్టుకోవాలి..వీటితో పాటుగా 500 గ్రాముల పశు వుల ఎరువు మరియు 250 గ్రాముల వేపచక్కను గుంతకు వేసుకోవాలి. ఫర్టిగేషన్‌ ద్వారా ఎరువుల యాజమాన్యం డ్రివ్‌ ద్వారా ఎరువులను అందిస్తే మొక్కకు నేరుగా ఎరువు చేరి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది..ఫర్టిగేషన్‌ ద్వారా 144:6:48 కిలోల నత్రజని భాస్వరం ఎరువులను ఒక హెక్టారుకు అందించి 113 కిలోల సూపర్‌ ఫాస్పేట్ను మాత్రం ఒక హెక్టారు మునగ మొక్కల పాదులలో వేసుకోవాలి.. ఇంకేదైనా సమాచారం తెలుసుకోవాలని అనుకుంటే వ్యవసాయ నిపుణులను సంప్రదించాలి..

Read more RELATED
Recommended to you

Latest news