బడ్జెట్‌ లైవ్‌ను ఎలా చూడాలి..? బడ్జెట్‌ ప్రతులను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి..?

-

ఇక కేంద్ర బడ్జెట్‌ రాబోతోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. లోక్‍సభ ఎన్నికల ముందు సర్కార్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఇదే ప్రభుత్వానికి ఆఖరి బడ్జెట్ కావడంతో అన్ని వర్గాల వాళ్లకి ప్రయోజనం కలిగేలా చూస్తారని అంతా చూస్తున్నారు.

 

జనవరి 31వ తేదీన అంటే నేడు పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. అలానే ఎకనమిక్ సర్వే సభలో ఈరోజే ప్రవేశపెడతారు. నెక్స్ట్ డే అంటే రేపు బడ్జెట్ ఉంటుంది. ఇక మరి దానికి సంబంధించి వివరాలని చూసేద్దాం. నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఇది మొదలు అవుతుంది. ఇది దాదాపు రెండు గంటల సేపు ఉంటుంది. లైవ్‌ లో యూనియన్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని మనం చూడచ్చు. అలాగేప్రైవేట్ బ్రాడ్‍కాస్టింగ్ టీవీ చానెల్స్ లో లైవ్ ఉంటుంది. అంతే కాకుండా అనేక డిజిటల్ న్యూస్ ప్లాట్‍ఫామ్‍ లో కూడా లైవ్ ఉంటుంది.

ఇక ఎలా డౌన్లోడ్ చెయ్యచ్చనేది చూస్తే.. మీ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ‘యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌’లో ఈజీగా ఎవరైనా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. నిర్మలాసీతారామన్‌ ప్రసంగం అయిన తర్వాత ఇవి మీకు అందుబాటులో ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్‌ రెండు భాషల్లో కూడా ఇవి ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news