ఇమ్రాన్.. అది నిరూపిస్తే రాజకీయాల్లోంచి వైదొలుగుతా : పాక్ మంత్రి సనావుల్లా

-

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్​కు ఆ దేశ మంత్రి రానా సనావుల్లా ఛాలెంజ్ విసిరారు. ఇమ్రాన్.. నాలుగు తూటాలు తగిలినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని సవాల్ చేశారు. పాకిస్థాన్‌లోని వజీరాబాద్‌ ర్యాలీలో ఇమ్రాన్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రానా సనావుల్లా స్పందించారు. ఇమ్రాన్‌ చెబుతున్నట్లు నాలుగు తూటాలు తగిలాయని నిరూపించాలని డిమాండ్ చేశారు. ఆయన చెబుతున్న సంఖ్యలో తూటాలు తాకలేదని సనావుల్లా పేర్కొన్నారు. మరోవైపు తనపై జరిగిన హత్యాయత్నం వెనుక.. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, మంత్రి రానా సనావుల్లా ఖాన్‌, ఆర్మీ మేజర్‌ జనరల్‌ ఫైసల్‌ నజీర్‌ల హస్తముందని ఇమ్రాన్‌ ఆరోపించారు.

ఇక ఈ హత్యాయత్నం కేసులో పంజాబ్‌ ప్రావిన్స్‌ పోలీసులు నేడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసులో నిందితుడు నవీద్‌ పేరును ప్రస్తావించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాక్‌ ప్రధాని, ఇంటీరియర్‌ మంత్రి, మేజర్‌ జనరల్‌పేర్లను మాత్రం దీనిలో చేర్చలేదు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను కోర్టులో సవాలు చేయాలని ఇమ్రాన్‌ మద్దతుదారులు నిర్ణయించుకొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news