ఒక్క క్యాచ్, ఒకే ఒక్క క్యాచ్ పట్టుంటే పాకిస్థాన్ కథ వేరేలా ఉండేది. ఆ క్యాచ్ పట్టుంటే.. పాక్ ఫైనల్ కూడా చేరేదేమో.. పాక్ ఆటగాడు హసన్ అలీ ఆ క్యాచ్ పట్టుంటే కథ వేరేలా ఉండేడి. ఒక్క క్యాచ్ డ్రాప్ పాక్ టీ20 వరల్డ్ కప్ కలను దూరం చేసింది. టీ20 ప్రపంచకప్ సెమీస్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో పాక్ ఆటగాడు హసన్ అలీ క్యాచ్ డ్రాప్ చేయడం ఇప్పుడ ఆదేశ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.దీంతో ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూవేడ్ రెచ్చిపోయాడు. ఫలితంగా మ్యాచ్ ఆస్ట్రేలియా వశమైంది.
నిన్న పాకిస్థాన్ తో ఆస్ట్రేలియా సెమీస్ లో తలపడ్డాయి. ఆద్యంతం మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఓ దశలో 95/5 గా ఉన్నా ఆస్ట్రేలియా స్కోరు… 20 ఓవర్లతో 177/5 కు చేరింది. ఫలితంగా 5 వికేట్ల తేడాతో పాకిస్థాన్ పై ఘనవిజయం సాధించింది. మాథ్యూ వేడ్ రూపంలో పాకిస్థాన్ కు మ్యాచ్ దూరం అయింది. చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సిన దశలో కేవలం ఒకే ఓవర్ లో మ్యాచ్ ముగించాడు మాథ్యూవేడ్. 10 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో షహీన్ ఆఫ్రిది వేసిన ఓవర్ లో భారీ సిక్స్ కు ప్రయత్నించిన మాథ్యూ వేడ్ క్యాచ్ ను బౌండరీ లైన్ దగ్గర హసన్ అలీ వదిలేశాడు. దీంతో ఆ తరువాత వరసగా మూడు సిక్సులు కొట్టిన మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియాకు చిరస్మరణీయమైన విజయం అందించాడు. ఫైనల్ చేరేందుకు సహాయపడ్డాడు. అంతకు ముందు పాక్ జట్టులో ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ లు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 176/4 స్కోరు చేసింది.
చివరకు మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కూడా క్యాచ్ పై స్పందించాడంటే.. ఆ క్యాచ్ పాకిస్థాన్ కు ఎంత కీలకమో తెలుస్తోంది. మేం క్రూషియల్ టైంలో క్యాచ్ ను వదిలేశాం. అది పట్టుంటే కథ వేరేలా ఉండేదని చెప్పకొచ్చాడు బాబార్ ఆజామ్.